రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన త్వరగా పూర్తి చేయాలి

Fri,May 10, 2019 02:35 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో మండలాల వారీగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న 5794 రికార్డుల్లో 5190 క్లియర్ అయ్యాయని, పనుల్లో వేగం పెంచి మిగితా రికార్డులను కూడా వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, డీఎస్‌వో కొండల్‌రావు, డీఎం సివిల్ సప్లయ్ ఇర్ఫాన్, డీసీవో మమత తదితరులు పాల్గొన్నారు.

18న జడ్పీ సర్వసభ్య సమావేశం
ఇందూరు: జడ్పీ సర్వసభ్య సమావేశం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో వేణు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షన సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ గౌరవ సభ్యులు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులు సకాలంలో హాజరుకావాలన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles