నిజాంసాగర్ జడ్పీటీసీగా శోభను గెలిపించాలి

Fri,May 10, 2019 02:34 AM

నిజాంసాగర్, నమస్తే తెలంగాణ : నిజాంసాగర్ మండలం టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి అయిన తన సతీమణి దఫేదార్ శోభను కారు గుర్తుకు ఓటు గెలిపిస్తే జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సుముఖంగా ఉందని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. తాను జడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతూ వచ్చానని, శోభ గెలుపొందితే జిల్లాలో 22 జడ్పీటీసీ స్థానాలతో కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడుతుందన్నారు. తన సతీమణితో కలిసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తామని అన్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలోని మాగి, ఒడ్డెపల్లి, అచ్చంపేట్ గ్రామాల్లో తన సతీమణి శోభతో పాటు మహమ్మద్‌నగర్ ఎంపీటీసీ అభ్యర్థి పట్లోల్ల జ్యోతి దుర్గారెడ్డి, ఒడ్డెపల్లి ఎంపీటీసీ బాలమణి, అచ్చంపేట ఎంపీటీసీ అభ్యర్థి సుజాత రమేశ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహమ్మద్‌నగర్ ఎంపీసీటీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్లోల్ల జ్యోతిని ప్రజలు గెలిపిస్తే నిజాంసాగర్ ఎంపీపీ పదవి ఆమెకు దక్కుతుందని, జ్యోతి ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తారని హామీ ఇచ్చారు. తాను 20 ఏండ్లుగా ఎన్నో పదవుల్లో కొనసాగానని, తమ అమ్మ బాలమణి రెండు సార్లు సర్పంచ్‌గా పని చేశారని, తన తండ్రి కిషన్ గున్కుల్ సర్పంచ్‌గా కొనసాగారన్నారు. ప్రజలు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు నుదుట విజయ తిలకం దిద్దారు. మాగి గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ రాజు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని, గుడిసెలు ఉన్న నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లను తప్పనిసరిగా కట్టిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేదల వివరాలు సేకరించామని తెలిపారు. అనంతరం అచ్చంపేట గ్రామంలో ప్రచారం నిర్వహించి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజాతను ప్రజలకు పరిచయం చేశారు. సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, నీటి సం ఘం అధ్యక్షుడు గంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గైని విఠల్, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు కే. అంజయ్య, అనసూయ, సంగమేశ్వర్‌గౌడ్, నాయకులు చింతకింది రాములు, సాదుల సత్యనారాయణ, గోడాల రేఖ, అచ్చంపేట సత్యనారాయణ, గుమాస్తా శ్రీనివాస్, మర్పల్లి రాములు, మంద బలరాం, యాటకారి నారాయణ, వాజిద్, మహేందర్, గంగి రమేశ్, రమేశ్, బాబుసేట్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles