పాప దొరికింది..

Fri,May 10, 2019 02:34 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ/ సంగారెడ్డి రూరల్ : సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో ఈ నెల 7న పాపను అపహరించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 7న ఉదయం 10 గంటల సమయంలో సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవి, మల్లేశం దంపతులకు పదేండ్ల తర్వాత ఆడ బిడ్డ జన్మించింది. ఆ పాపను అదే రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన బంగారు సంతోష్, బంగారు శోభ దంపతులు అపహరించారు. సంతోష్, శోభల కూతురు కరుణకు మొదట ఒక మగ శిశువు పుట్టి చనిపోయింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో నిలోఫర్‌లో ఆమెకు ఒక ఆడబిడ్డ అనారోగ్యంతో జన్మించింది. ఆ పాపకూడా చికిత్స పొందుతూ రెండు రోజులకే మృతి చెందింది. కూతురుకు బిడ్డలు పుట్టి చనిపోతుండడంతో ఆమె ఆవేదన చూడలేక తల్లిదండ్రులు బంగారు సంతోష్, శోభ ఎవరైనా రోజులు నిండిన పాపను దత్తతకు ఇస్తారేమోనని దవాఖానలో చుట్టుపక్కల వాళ్లను అడిగారు. కరుణకు రెండో కాన్పులో తన బిడ్డ చనిపోయిన విషయాన్ని సంతోష్, శోభ తెలియనివ్వలేదు. 6వ తేదీన కరుణకు పుట్టిన ఆడబిడ్డ చనిపోవడంతో పాప అంత్యక్రియలు చేశారు. సంగారెడ్డి దవాఖానలో చంటిపిల్లలను దత్తకు ఇస్తారని ఎవరో చెప్పడంతో వారు ఈ నెల 7న ఇక్కడి వచ్చారు. విధులు నిర్వహిస్తున్న ఓ డాక్టర్‌ను ఇక్కడేమైనా చంటి పిల్లలను దత్తకు ఇస్తారా అని అడడగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. కూతురు కరుణ ఆవేదన చూడలేక ఆ తల్లిదండ్రులిద్దరూ ఎలాగైనా ఓ పాపను తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. కలబ్‌గూర్‌కు చెందిన మాధవికి పుట్టిన బిడ్డకు పాలు పట్టించాలని అక్కడి సిబ్బంది రెండు, ముడు సార్లు పిలిచినా ఎవరూ రాలేదు. ఇదే అదునుగా భావించిన శోభ ఆ పాప తమదేనని తీసుకెళ్లింది. అక్కడి నుంచి వారిద్దరు ఆ పాపను తీసుకుని బైక్‌పై జోగిపేట మీదుగా ఎల్లారెడ్డికి చేరుకున్నారు. ఆ పాప తన కూతురు కరుణకే పుట్టిందని చెప్పారు. ఆమె కూడా నమ్మింది.

సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తింపు...
సంగారెడ్డి జిల్లా దవాఖనాలో పాప మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలు విడిపోయి ఎట్టకేలకు పాప ఆచూకీ పట్టుకున్నారు. ఈ కేసు ఛేదనకు సీసీ ఫుటేజీలు ఎంతో కీలకంగా మారాయి.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles