పలు కాలనీల్లో చెత్త తొలగింపు

Thu,May 9, 2019 12:57 AM

విద్యానగర్ : జిల్లా కేంద్రాన్ని స్వచ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని 33వ వార్డు, 6వ వార్డులో పేరుకుపోయిన చెత్తను, డ్రైనేజీలను మున్సిపల్ సిబ్బంది బుధవారం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ మాట్లాడుతూ& స్వచ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దేందుకు ప్రతి రోజూ అపరిశుభ్రంగా ఉన్న కాలనీలు, డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. గతంలో కన్నా ఇప్పడు సిబ్బంది ఎక్కువగా ఉన్నారని, ప్రతి కాలనీని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంట మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, ఆయా వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు.

దైవం.. సమాజానికి ప్రాణం లాంటిది
గాంధారి: దైవం సమాజానికి ప్రాణం లాంటిదని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. మండలంలోని తిప్పారం తండాలో నూతనంగా నిర్మించనున్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి బుధవారం చిన జీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా తండాకు వచ్చిన చిన జీయర్ స్వామికి తండావాసులు ఘనంగా స్వాగంతం పలికారు. ఆలయ నిర్మాణం సల్థంలో ప్రత్యేక పూజలు చేసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, అందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమాజానికి దైవం అనేది ప్రాణం లాంటిదని, దైవంపై నమ్మకంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. తిప్పారం తండా ప్రజలంతా కలిసి దాదాపు రూ.మూడు కోట్లతో శ్రీ రామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు.

ఆలయ నిర్మాణం ప్లాన్‌ను పరిశీలించిన చిన్న జీయర్ స్వామి, ఆలయానికి ఇరువైపుల అమ్మవారి సన్నిధులు ఏర్పాటు చేయాలని దీంతో పాటు రామానుజ ఆచార్యులకు సైతం సన్నిధిని నిర్మించాలని సూచించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రూ.లక్ష విరాళాన్ని చిన జీయర్ స్వామి తండా వాసులకు అందజేశారు.

సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ
సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని చినజీయర్ స్వామి అన్నారు. కేసీఆర్ పాలనలో యాదాద్రీతో పాటు, వేములవాడ, భద్రాద్రీలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నీటి వనరులతో పాటు, వృక్ష సంపద, పంటలు పండే విధంగా కృషి చేయడమే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనడానికి నిదర్శనమన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
కార్యక్రమానికి హాజరైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ తండా వాసులంతా కలిసి ఆలయ నిర్మించడం సంతోషకరమైన విషయమన్నారు. తండాలో ఆలయ నిర్మాణంతో పాటు, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, మాజీ మంత్రి నేరళ్ల ఆంజనేయులు, జడ్పీటీసీ తానీజీరావు, ఎంపీపీ యశోదబాయి శివాజీ, టీఆర్‌ఎస్ నాయకులు సత్యం పటేల్, ముకుంద్‌రావు, శంకర్‌నాయక్, సర్పంచ్ సుందరీబాయి బిషన్‌నాయక్, తాన్‌సింగ్, గంగారాం, తండా వాసులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles