ఆర్థిక ఇబ్బందులతో వీఆర్‌ఏ ఆత్మహత్య

Thu,May 9, 2019 12:57 AM

భిక్కనూరు : ఆర్థిక ఇబ్బందులతో వీఆర్‌ఏ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భిక్కనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దమల్లారెడ్డిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇసన్నపల్లికి చెందిన సంతోష్ (36)కు కొన్ని సంవత్సరాల క్రితం మండలంలోని పెద్దమల్లారెడ్డికి చెందిన రాజమణితో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా భార్యతో కలిసి పెద్దమల్లారెడ్డిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు స్పందన, స్వాతి ఉన్నారు. స్పందన దోమకొండలో హాస్టల్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుతోంది. చిన్న కూతురు స్వప్న పెద్దమల్లారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది.సంతోష్ ఇసన్నపల్లిలో వీఆర్‌ఏగా విధులు నిర్వర్తించేవాడు. మంగళవారం విధులు నిర్వర్తించి ఇంటికి వచ్చి రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంతోష్‌ను గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బుధవారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. భార్య రాజమణి ఫిర్యాదు మేరకు భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles