రెండో విడతకు సర్వం సిద్ధం

Fri,April 26, 2019 12:40 AM

- నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- 28 వరకు దరఖాస్తులకు గడువు
- 2న ఉపసంహకరణకు అవకాశం
- 10న పోలింగ్.. 27న ఓట్ల లెక్కింపు
- 77 ఎంపీటీసీ స్థానాలు, ఏడు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
- లక్షా 95 వేల 880 మంది ఓటర్లు

బాన్సువాడ, నమస్తే తెలంగాణ: బాన్సువాడ డివిజన్‌లోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్‌గల్, జుక్కల్ మండలాల్లో శుక్రవారం నుంచి రెండో విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడుతలో మొత్తం 77 ఎంపీటీసీ స్తానాలు, ఏడు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరుగబోయే ఏడు మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏడు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న నామినేషన్ల పరిశీలన, మే 2వ తేదీన ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. మే 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 27వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏడు మండలాల్లో కలిపి లక్షా 96 వేల 984 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

లక్షా 95 వేల 880 మంది ఓటర్లు
రెండో విడుతలో ఏడు మండలాల్లోని జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బాన్సువాడ మండలంలో 13,222 మంది పురుష ఓటర్లు ఉండగా, 14 వేల 304 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బీర్కూర్ మండలంలో 18,738 మంది ఓటర్లు ఉండగా వారిలో 9875 మంది మహిళా ఓటర్లు ఉండగా, 8863 మంది పురుష ఓటర్లు ఉన్నారు. నస్రుల్లాబాద్ మండలంలో 19,970 మంది ఓటర్లు ఉండగా, వారిలో 10,511 మంది మహిళా ఓటర్లు ఉండగా, 9,458 మంది పురుష ఓటర్లు ఉన్నారు. బిచ్కుంద మండలంలో 38,885 మంది ఓటర్లు ఉండగా వారిలో 16,295 మంది మహిళా ఓటర్లు ఉండగా, 19,094 మంది పురుష ఓటర్లు ఉన్నారు. జుక్కల్ మండలంలో 32,828 మంది ఓటర్లు ఉండగా, వారిలో 16,295 మంది మహిళా ఓటర్లు ఉండగా, 16,533 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పెద్దకొడప్‌గల్ మండలంలో 15,141 మంది ఓటర్లు ఉండగా, వారిలో 7,622 మంది మహిళా ఓటర్లు, 7,518 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మద్నూర్ మండలంలో 42,790 మంది ఓటర్లు ఉండగా, వారిలో 21,419 మంది మహిళా ఓటర్లు ఉండగా, 21,368 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ముగ్గురు ఓటర్లు ఉన్నారు. రెండో విడుత ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొత్తం లక్షా 95 వేల 880 మంది ఓటర్లు ఉన్నారు.

ఆశావహులే బరిలో...
రెండు నెలల క్రితం గ్రామాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశపడి భంగపాటు తప్పని నాయకులకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గత ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచి పదవికి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, లేదా బరిలో నిలువాలని ఉన్న గ్రామంలో టికెట్ రాక భంగపాటు ఎదురైన నాయకులు ఎంపీటీసీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచుకు నిలువాలని ఎన్నో ఆశలు పెట్టుకొని, రిజర్వేషన్ రాకపోవండతో ఖంగుతిన్న నేతలు, ప్రస్తుతం ఎంపీటీసీ స్థానానికి రిజర్వేషన్ రావడంతో బడానేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమాయ్యరు. అంతేకాకుండా పార్టీలో సంవత్సరాల తరబడి పార్టీల పటిష్టతకు పాటుపడిన నేతలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ పెద్దలు చెబుతున్నట్లు సమాచారం. రెండో విడుత ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలకు ఎక్కువ మొత్తంలో ఏకగ్రీవం కోసం ద్వితీయ శ్రేణి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

77 ఎంపీటీసీలు, 7 జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు
రెండో విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బాన్సువాడ మండలంలో 11 ఎంపీటీసీ, బీర్కూర్ మండలంలో 7, నస్రుల్లాబాద్ మండలంలో 8, బిచ్కుంద మండలంలో14, మద్నూర్ మండలంలో 17, పెద్ద కొడప్‌గల్ మండలంలో 6, జుక్కల్ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఏడు జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గ్రామాల్లో 400 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్‌లలో ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఆర్వోలను నియమించారు. బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో ముగ్గురు ఎంపీటీసీలకు ఒక ఆర్వోను నియమించారు. ముగ్గురు ఎంపీటీసీలకు మించిన మండలాల్లో అదనంగా ఆర్వోలను ఏర్పాటు చేశారు. బాన్సువాడ మండలంలో నామినేషన్ల స్వీకరణకు ఎంపీటీసీలకు నలుగురు ఆర్వోలు, బీర్కూర్ మండలంలో ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణకు ముగ్గురు ఆర్వోలను, నస్రుల్లాబాద్ మండలంలో ముగ్గురు ఆర్వోలు, బిచ్కుంద మండలంలో ఐదుగురు ఆర్వోలు, జుక్కల్ మండలంలో ఐదుగురు ఆర్వోలు, మద్నూర్ మండలంలో ఆరుగురు ఆర్వోలు, పెద్దకొడప్‌గల్ మండలంలో ఇద్దరు ఆర్వోలను నియమించారు. అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఆర్వోలు తమకు కేటాయించిన గ్రామాల ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు ఉదయం 10 గంటల నుంచి ఎంపీడీవో కార్యాలయాల్లో సిద్ధంగా ఉంటారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles