రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

Fri,April 26, 2019 12:38 AM

నిజాంసాగర్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ప్రతి రైతు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి తెలిపారు. ఈ నెల 22న నమస్తే తెలంగాణ దినపత్రిక ధర్మగంటలో పైసాచికం శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించి మల్లూర్‌లో మూడు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గురువారం జేసీ స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండలంలో పలు సమస్యలపై 170 మంది రైతులు దరఖాస్తులు అందజేశారని తెలిపారు. జిలాల్లోని అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కామారెడ్డి డివిజన్‌లో పెద్దమల్లారెడ్డి, బీబీపేట్, ఎల్లారెడ్డి డివిజన్‌లోని మాల్‌తుమ్మెద, పర్మల గ్రామాల్లో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాసుబుక్కు రాని వారికి కొత్త పాసుబుక్కులను అందించి రైతుబంధు పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు చెందిన 10 నుంచి 15 రకాల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు. నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామంలో రైతులు ఎదర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తహసీల్ కార్యాలయంలోని కంప్యూటర్, ప్రింటర్‌ను తీసుకొచ్చి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో మూడు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కార్యకమాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. మల్లూర్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌ను రైతులు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

జిల్లాలో 80 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జిల్లాలో 80 ధాన్యం కేంద్రాలు ప్రారంభించామని జేసీ యాదిరెడ్డి తెలిపారు. ఈ కేంద్రాల్లో లక్షా 50 వేల క్వింటాళ్లు కొనగోలు చేశామన్నారు. జిల్లాలో అన్ని కేంద్రాలకు 14 లక్షల గోనె సంచులు పంపించామన్నారు. ఇంకా 5 లక్షల నుంచి 10 లక్షల గోనె సంచులు రానున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం లక్ష టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. జేసీ వెంట తహసీల్దార్ సంజీవ్‌రావు, డిప్యూటీ తహసీల్దార్ అమలత, వీఆర్వో సాయన్న ఉన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles