పకడ్బందీగా నామినేషన్ల పరిశీలన

Fri,April 26, 2019 12:38 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారులు మాత్రమే చూడాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా అభ్యర్థిని, ప్రతిపాదకున్ని, అభ్యర్థి రాతపూర్వకంగా తెలిపిన ఒకరిని మొత్తం ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలన్నారు. ఫారం-5 చూపిన నామినేషన్‌ల వరుస క్రమంలోనే ఒక దాని తరువాత మరొక నామినేషన్ ఆర్వో పరిశీలన చేపట్టాలన్నారు. నామినేషన్ పేపర్ ఏదైనా ఆక్షేపణను ప్రస్తావించిన్నట్లు అయితే అట్టి ఆక్షేపణపై సంక్లిప్త దర్యాపు నిర్వహించి ఆ తరువాతనే అంగీకరించడం, తిరస్కరించడం చేయాలని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీవోలు, జడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పీలు చేసుకోవడానికి వీలుంటుందన్నారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్థుల పేర్లను ఒక సారి మాత్రమే ప్రకటించాలన్నారు. ఈ నెల 28న తేదీన మధ్యాహ్నం 3 గంటల తరువాత స్క్రూటినీ నిర్వహించి ఫారం-9 తయారు చేయాలన్నారు. ఫాం-9లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల పేర్లు, ఎన్నికల జాబితాలో కింద తెలిపిన విధంగా తెలుగు వర్ణమాల క్రమంలో వర్గాలుగా విభజించి చూపాలన్నారు.

గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిష్టర్ అయి ప్రత్యేక గుర్తింపు కేటాయించిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక గుర్తు కేటాయింపు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిష్టరు చేసుకోవాలన్నారు. స్వతంత్ర అభ్యర్థులు సంయుక్తంగా గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపసంహరణ ముగిసిన 24 గంటల్లో సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లు ఫారం-14లో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారికి కౌంటర్ పాయిట్స్‌తో కూడిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లు అందిన వెంటనే సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పేపర్ పంపాలన్నారు. ప్రతీ సర్వీస్ ఓటరుకు పంపిన పోస్టల్ బ్యాలెట్ పేపర్‌ల సరైన గణాంకాల నిమిత్తం ఒక రిజిష్టర్‌లో నమోదు చేసి పోస్టల్ అధికారిచే పంపాలన్నారు. సర్వీస్ ఓటరుకు సంబంధించిన కవరులో కాకుండా ప్రత్యేకంగా మరో కవర్‌లో పోస్టల్ బ్యాలెట్ పేపరును పంపాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్, నోడల్ అధికారులు ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles