వేసవి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి

Fri,April 26, 2019 12:37 AM

కామారెడ్డిరూరల్ : వేసవి సెలవుల్లో కామారెడ్డి మండల పరిధిలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దేవునిపల్లి ఎస్‌హెచ్‌వో, ట్రైనీ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగల ముఠా కొందరు మన ప్రాంతంలో సంచరిస్తూ పగలు, రాత్రి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని ఇంట్లో విలువైన సామగ్రి ఏమైనా ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, తప్పని సరిగా ఇళ్లలో అందరూ ఊర్లకు వెళ్లకుండా ఇంట్లో ఒకరు ఉండేట్లుగా చూసుకోవాలని సూచించారు. తమ ప్రాంతాల్లో, కాలనీల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే తప్పని సరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వీలైనంత వరకు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చని, నేరాలను అదుపు చేయవచ్చని సూచించారు. ఏదైనా ఫిర్యాదుల కోసం 100, 08468-229633, 9440795437 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles