మలేరియాను రూపుమాపుదాం

Fri,April 26, 2019 12:37 AM

పెద్దకొడప్‌గల్: మలేరియా వ్యాధిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దకొడప్‌గల్ ఎంపీటీసీ నరహరి అన్నారు. ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన సిబ్బంది చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రజలు ఇళ్ల పరిసరాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమ తెరలను వినియోగించుకోవాలని, కిటికీలకు జాలీలను వాడాలని అన్నారు. రోగ లక్షణాలు ఉన్నట్లుయితే వెంటనే వైద్యులకు చూపించాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యుడు శరత్ కుమార్, డాక్టర్ నారాయణ్‌రావు, పండరి, శైలజ, కల్పన, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ
మద్నూర్: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. మలేరియా అంతం కావాలని సిబ్బంది నినాదాలు చేశారు. ఇళ్లలోకి దోమలు రాకుండా కిటికీలకు జాలీలు బిగించుకోవాలని సూచించారు. ప్రజలు ఇళ్ల పరిసరాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలని, పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏఎన్‌ఎంలు పుష్ప, సంగీత, రాజమణి, ఆశ వర్కర్లు ఉన్నారు.

పిట్లంలో
పిట్లం: మండల కేంద్రంలో ఆరోగ్యశాఖ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి శివకుమార్ మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహనకు ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. దోమలు వృద్ధి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది దీపిక, మాణిక్యమ్మ, అన్సారీ బేగం, ఏక్‌నాథం, శ్రీనివాస్ పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles