సజ్జన్‌పల్లిలో విచారణ చేపట్టిన అధికారులు

Thu,April 25, 2019 03:30 AM

లింగంపేట: మండలంలోని సజ్జన్‌పల్లి గ్రామంలో బుధవారం రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నమస్తే తెలంగాణ మినీలో కాళ్లు మొక్కినా కనికరించలేదు.. అనే శీర్షిన ప్రచురితమైన కథకనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా గ్రామంలో విచారణ చేపట్టారు. నూతన పట్టదారు పాసుపుస్తకాల్లో నమోదు కాని సర్వే నంబర్ల వివరాలు, ఒకరి భూమి ఇతరుల పేరుపై మారిన సర్వే నంబర్ల వివరాలు సేకరించారు. గ్రామంలో లేని సర్వే నంబర్లతో కూడిన వివరాలు పాసుపుస్తకంలో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 1బీ, పహాణీలో ఉన్న వివరాల ప్రకారం సరి చేస్తామని అధికారులు వెల్లడించారు. తప్పులను సరి చేస్తామని అధికారులు రైతులకు వివరించారు. విచారణలో గిర్దావార్ సుభాష్, వీఆర్వో ధర్మయ్యతో పాటు రైతులు ఉన్నారు.

తప్పులు చేసిన అధికారే విచారణకు హాజరు
మండలంలోని సజ్జన్‌పల్లి గ్రామంలో తప్పులు చేసిన అధికారినే విచారణకు పంపడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన పాసుపుస్తకాల్లో తప్పులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దొర్లాయి. పాసుపుస్తకాల్లో వచ్చిన తప్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతుబంధు డబ్బులు కోల్పోయారు. తమకు డబ్బులు రాలేవని రికార్డుల్లో వివరాలు సరి చేయాలని కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. వివరాలు సరి చేయడానికి జిరాక్స్ కాపీలు అందించినప్పటికీ సరి చేయలేక పోయారు. తహసీల్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో వీఆర్వో ధర్మయ్య తహసీల్దార్‌కు కలువడానికి అడ్డుకునే వాడని వాపోయారు. పత్రికల్లో వార్త రావడంతో తిరిగి విచారణకు పంపడంపై నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరారు.

నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు
పట్టదారు పాసుపుస్తకాల్లో వచ్చన తప్పులను నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితం చేసి అధికారుల్లో కదలిక తేవడంపై రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తప్పులను సరి చేయాలని తహసీల్ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందించని అధికారుల పత్రికలో వార్తలు రావడంతో గ్రామంలో విచారణ చేపట్టారు. వార్త ప్రచురితం చేసి రైతులకు న్యాయం జరిగేందుకు కృషి చేసిన నమస్తే తెలంగాణకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles