పాత సామగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం

Thu,April 25, 2019 03:30 AM

లింగంపేట: మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గృహం కాలిపోయి భారీగా ఆస్తినష్టం సంభవించింది. మండల కేంద్రానికి చెందిన గౌస్ అనే వ్యక్తి పాత ఇసుప సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు వ్యాపారం నిర్వహిస్తుంటారు. బుధవారం తెల్లవారు జామున ప్రమాదంశాత్తు ఇంటి ఎదురుగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు నిప్పంటుకుంది. ప్లాస్టిక్ వస్తువులు కాలుతూ ఇంట్లో ఉన్న సామగ్రికి నిప్పంటుకుంది. అగ్ని ప్రమాద విషయాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్పించినప్పటికీ విఫలమయ్యారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఎల్లారెడ్డి అగ్నిమాపక ఇబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్లాస్టిక్ వస్తువులకు నిప్పంటుకోవడంతో మంటలు త్వరగా అదుపులోకి రాలేకపోయాయి. నివాస గృహంలో ఉంచిన సామగ్రితో పాటు ఇంటి ఎదురుగా ఉన్న పాత సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సంఘటనలో సుమారు రూ.2.30 లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. బుధవారం ఉదయం గిర్దవార్ సుభాష్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles