అంతర్గత నైపుణ్యాలకు ప్రాధాన్యత కల్పించాలి

Wed,April 24, 2019 01:24 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : విద్యార్థుల అంతర్గత నైపుణ్యాలకు ప్రాధాన్యత క ల్పించాలని, నైపుణ్యాలకు కూడా మా ర్కులు కేటాయించాలని లీడ్ ఇండియా 2020 సభ్యులు జీనియస్ గంగారెడ్డి అ న్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అనేకమంది వి ద్యార్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ లో పాస్‌కాలేక ఆత్మహత్యలకు పాల్పడడం విషాదకరమని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వె లువడిన అనంతరం 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి విలువైన ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్య క్తం చేశారు. ఇంటర్ మూల్యాంకనంలో అనుభవం లేని వారికి పేపర్ దిద్దడం ఇవ్వడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, తెలివైన వి ద్యార్థులు బాగా రాసినప్పటికీ ఫెయిల్ మార్కులు రావడంతో మనోైస్థెర్యం కో ల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పది నుంచి డిగ్రీ వరకు అంతర్గత నైపుణ్యాలకు మార్కులు కేటాయించి విద్యార్థులు పాస్ అయ్యేలా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాట వేయాలని ప్రభుత్వాన్ని కో రారు. ప్రతి పాఠశాల ఒక పరిశోధనా కేంద్రంగా రూపుదిద్దాలని అందుకు వి ద్యార్థి స్థాయి నుంచి సామాజిక విలువలు, నైతిక విలువలు పెంపొందింపజేసి సమాజానికి ఉపయోగపడే విధం గా విద్యార్థులను తయారు చేయాలని కోరారు.

45
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles