జిల్లా ఎన్నికలపై సమీక్ష

Wed,April 24, 2019 01:24 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి డివిజన్‌లోని 9 మండలాల్లో నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కలెక్టర్ చాంబర్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకురాలు, సీనియర్ ఐజీ అభిలాష బిష్త్, కలెక్టర్ సత్యనారాయణ నోడల్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ... జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8 లక్షల 18 వేల 228 మంది ఉన్నారని, వీరిలో పురుషులు 4 లక్షల 2 వేల 796 మంది, మహిళలు 4 లక్షల 15 వేల 432 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 3 మున్సిపాలిటీలు కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఉన్నాయని, జిల్లాలో 17 బ్లాక్స్, 22 మండలాల్లో 526 గ్రామ పంచాయతీలు, 473 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 6 లక్షల 7 వేల 719 మంది ఉండగా.... వీరిలో పురుషులు 2 లక్షల 93 వేల 577 మంది, మహిళలు 3 లక్షల 14 వేల 111 మంది ఉన్నారని, ఇతరులు 33 మంది ఉన్నారని తెలిపారు. మొదటి విడత కింద 88 ఎంపీటీసీ స్థానాలకు, 9 జడ్పీటీసీ స్థానాలకు మే 6న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కోసం 486 పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 36 మంది రిటర్నింగ్ అధికారులు, 36 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జడ్పీటీసీలకు 9 మంది రిటర్నింగ్ అధికారులు, నామినేషన్ స్వీకరణకు 9 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం జోనల్ ఆఫీసర్లుగా 27 మంది, ప్రిసైడింగ్ అధికారులుగా 584, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా 584 మంది, పోలింగ్ అధికారులుగా 2204 మంది విధులు నిర్వహిస్తారన్నారు. అంతకుముందు స్థానిక ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు. సమావేశంలో జేసీ యాదిరెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీపీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles