పాసుబుక్కు పరేషాన్

Mon,April 22, 2019 11:42 PM

బాన్సువాడ రూరల్: రైతును రాజు చేయడమే ల క్ష్యంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు అ మలు చేస్తుంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అ న్నదాతకు శాపంగా మారుతున్నది. ప్రతీ రైతుకు ఎంత భూమి ఉందో నిర్ధారించి వారికి లబ్ధి చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మంగా అమలు చే సిన భూ ప్రక్షాళన కార్యక్రమం సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంతో అర్హులైన రైతులకు అన్యా యం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హుడిగా ఉన్నప్పటికీ రికార్డుల నమోదు లో చేసిన చిన్న తప్పిదాలు రైతులను అవస్థల పాలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దూరం కావడంతో రైతులు రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు ఎకరాల 22 గుంటల భూమి ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం రాక ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకానికి దూరమైన ఘటన బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు బోయిని అంబయ్య ఏడాదిగా పట్టాపాసు పుసక్తం కోసం చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా చలనం లేకపోవడంతో ప్రభుత్వం అందించిన రెండు విడుతల రైతుబంధు పథకానికి దూరం అయ్యాడు.

సంవత్సరం గడిచినా అందని పట్టాపాసు పుస్తకం
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన బోయిని అంబయ్య పేరున 4.22 ఎకరాల భూమి పట్టాగా ఉంది. గత ప్రభుత్వం పట్టాపాసుపుస్తకం జారీ చేసిన పుస్తకంలో ఇది క్లుప్తంగా ఉంది. గత ఏడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలు చేసిన భూ ప్రక్షాళనలో తన భూముల వివరాలను గ్రామ రెవెన్యూ అధికారికి అందించి నూతన పట్టాపాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నూతన పట్టాదారు పాసుపుస్తకం కోసం తన వద్ద ఉన్న పాత పట్టాపాసుపుస్తకం ధ్రువీకరణ పత్రాలు సైతం అందజేశారు. పాత పట్టాపాసుపుస్తకం పట్టా నెంబర్ 792 కాగా అతని పేరున ఉన్న ఏడు సర్వే నంబర్లలో 557లో 1.12 ఎకరాలు, 456లో 8 గుంటలు, 457లో 7 గుంటలు, 316అలో 36 గుంటలు, 316ఆ లో 37 గుంటలు, 315లో 3 గుంటలు, 583లో 39 గుంటల భూమి మొత్తం 4.22 ఎకరాల భూమి ఉన్నది. పూర్తిగా వివరాలు అందించిన అంబయ్యకు రెవెన్యూ అధికారులు పరిశీలించి నూతన పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయాల్సి ఉండగా, సంవత్సరం గడిచిపోయినా పుస్తకం జారీ కాకపోవడంతో ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకానికి దూరం అయ్యాడు.

పట్టాపుస్తకం రాగానే ఇస్తాం
రైతు అంబయ్య వివరాలు సక్రమంగా నమోదు చేశాము. ఆయన పట్టాదారు పాసుపుస్తకం రావడంలో జాప్యం జరిగింది. ఇటీవల ఆయనకు 4.22 ఎకరాల భూమి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సైతం అందజేశాం. పట్టాకు సంబంధించిన డిజిటల్ సంతకం పూర్తయ్యింది. పహాణీ, వన్‌బీ పత్రాలు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. తాము అందించిన పట్టా ధ్రువీకరణ పత్రంతో రైతుబంధు సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టా పాసుప్తుకం జారీ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సైతం తెలియజేశాం. పట్టా పాసుపుస్తకం రాగానే రైతుకు అందజేస్తాం.
- రజినీ, వీఆర్వో, ఇబ్రహీంపేట్, బాన్సువాడ

రైతుబంధు సహాయానికి దూరం
అధికారుల నిర్లక్ష్యం రైతు అంబయ్యకు శాపంగా పరిణమించింది. గ్రామ రెవెన్యూ అధికారి ఆయన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడంతో పట్టాపాసుపుస్తకం రాక ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకానికి దూరం అయ్యాడు. రైతుబంధు పథకం అమలు చేసిన ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇప్పటి వరకు రెండు విడుతలుగా అందించింది. రెవెన్యూశాఖ అధికారుల నిర్లక్ష్యంతో అర్హుడిగా ఉన్న బోయిని అంబయ్య దాదాపు రూ.37 వేలు నష్టపోయాడు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో పట్టా పాసుపుస్తకం రావపోవడంతో పాటు రైతుబంధు సహాయాన్ని కోల్పోయానని రైతు అంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజావాణిలో జేసీకి ఫిర్యాదు
రెవెన్యూ అధికారుల మాటలను నమ్మి ప ట్టాపాసుపుస్తకం కోసం అంబయ్య సంవత్సర కాలం నుంచి వేచి చూస్తున్నాడు. పట్టాపుస్తకం రాకపోవడంతో గత్యంతరం లేక ఫిబ్రవరిలో జి ల్లా కేంద్రంలో జేసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అర్హుడినైన తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన జేసీ ముందు మొరపెట్టుకున్నాడు. జేసీ స్థానిక తహసీల్దార్‌కు రిఫర్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జేసీ నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక రెవెన్యూ అధికారుల్లో చలనం వచ్చింది. ఆయన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు తిరిగి పంపగా, ఇటీవల ఆయన పేరున 4.22 గుంటల భూమి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు రెవెన్యూ అధికారులు. త్వరలోనే పాసుప్తుకాలు వస్తాయని ఆయనకు బుజ్జగించారు.

పాసుపుస్తకం కోసం ఏడాదిగా తిరుగుతున్నా
కొత్త పట్టాదారు పాసుపుస్తకం కోసం ఏడాది కాలంగా తిరుగుతున్నాను. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రెండు విడుతలుగా రైతుబంధు సహాయాన్ని కోల్పోయాను. గత నెల నా భూమికి సంబంధించిన కాగితం ఇచ్చారు. బుక్కులు రాగానే ఇస్తామన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని నాకు న్యాయం చేయాలి. త్వరగా పట్టాపాసుపుస్తకం ఇప్పించి ఆదుకోవాలి.
- బోయిన అంబయ్య, రైతు ఇబ్రహీంపేట్, బాన్సువాడ

55
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles