దివ్యాంగుల వివరాల సేకరణ

Mon,April 22, 2019 11:42 PM

నిజాంసాగర్,నమస్తే తెలంగాణ: మండలంలో 0 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల దివ్యాంగులపై సర్వే కొనసాగుతున్నది. సోమవారం మండలంలో చిన్నారెపల్లి, వెల్గనూర్ తదితర గ్రామాల్లో 21 రకాలకు చెందిన బుద్ధ్దిమాంద్యం, దృష్టిలోపం, వినికిడి లోపం తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఐఆర్‌టీయూలు చిన్నసాయిలు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

దీర్ఘకాలిక రోగుల వివరాలు సేకరణ
పిట్లం: మండల కేంద్రంలో దీర్ఘకాలిక రోగుల వివరాలు సేకరణ చేపడుతున్నామని వైద్యాధికారి శివకుమార్ అన్నారు. వైద్య సిబ్బంది సోమవారం మొదటి రోజు పిట్లం, కిష్టాపూర్ గ్రామాల్లో 30 సంవత్సరాలు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు నిర్ధారించి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామన్నారు. రోజూ 30 మందికి వైద్య పరీక్షలు నిర్వస్తున్నామన్నారు. సిబ్బంది మాణిక్యమ్మ, ఎక్‌నాథం, ముజైదాబేగం ఉన్నారు.

ప్రతి వారం ఫిజియోథెరపీ
పిట్లం: మండలంలోని భవిత కేంద్రం ఐఈఆర్‌టీలు కమల్‌కిశోర్, గంగాధర్ దివ్యాంగుల వివరాల సేకరించారు. కమల్‌కిశోర్ మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామాన పర్యటించి దివ్యాంగ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. వీరికి భవిత కేంద్రంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని , ఆరోగ్యం మెరుగు పడేలా ప్రతి వారం ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles