ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mon,April 22, 2019 01:08 AM

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. జిల్లా కేంద్రంలోని కామారెడ్డి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీ ఎన్నికల్లో ఓ టింగ్ శాతాన్ని పెంచడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. దీని కోసం ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ఫొటో ఓటరు స్లిప్ అందని 11 రకాల కార్డుల్లో ఏదైనా తీసుకుని వస్తే ఓటును వేసేందుకు అనుమతిస్తామని తెలిపా రు. సోమవారం నిర్వహించనున్న మొదటి విడుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లకు రిటర్నింగ్ అసిస్టెంట్ అధికారులు అభ్యర్థులతో పాటు ఏజెంట్, మరో వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయానికి నామినేషన్‌తో పాటు విద్యార్హతలు, బ్యాంక్ అకౌంట్, క్రిమినల్ రికార్డ్సుపై, ఆస్తుల వివరాలపై పొందుపర్చాలన్నారు. జడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు నామినేషన్‌కు రూ.5 వేలు, రిజర్వేషన్ అభ్యర్థులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) రూ.2,500, ఎంపీటీసీకి జనరల్ అభ్యర్థులు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 నామినేషన్ సందర్భంగా చెల్లించాలన్నారు. అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఎవరైనా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన పత్రాలు అందించాలన్నారు. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణపై కలెక్టర్‌కు, ఎంపీటీసీలపై ఆర్డీవో (రెవెన్యూ డివిజనల్ అధికారి)కి అప్పీల్ చేసుకోవాలన్నారు. జడ్పీటీసీ రూ.4 లక్షల వరకు, ఎంపీటీసీ రూ.లక్షా 50 వేల వరకు ఖర్చు పరిమితి ఉంటుందన్నారు. మే 27న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. పోలింగ్ రోజు ఓటర్లు ఫొటో ఓటరు స్లిప్, ఎపిక్ గుర్తింపు పొందిన 11 ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు చూపించాలన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles