బాన్సువాడలో ట్రాఫిక్ ఇబ్బందులు

Mon,April 22, 2019 01:07 AM

పాత బాన్సువాడ : విస్తరిస్తున్న బాన్సువాడ పట్టణాన్ని ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. ప్రధాన రహదారి విస్తరణతో వాహన రాకపోకలకు సౌకర్యవంతం కాగా వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నిలుపడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాపార సముదాయాల ఎదుట షాపింగ్ కోసం వచ్చిన కొనుగోలుదారులు వాహనాలను ఇష్టారీతిన నిలపడంతో భారీ వాహనాలు వెళ్లడం కష్టమవుతోంది. పట్టణంలోని రద్దీ ప్రాంతాలైన బస్టాండ్, ఎస్‌బీఐ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అంబేద్కర్ చౌరస్తాలోని పాత బాన్సువాడ రహదారిలో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించాలంటే నానా తంటాలు పడాల్సివస్తోంది. ఎస్‌బీఐ వద్ద వాహన పార్కింగ్ ఏర్పాటు చేయాల్సిన బ్యాంకు అధికారులు అంతగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు వ్యాపార సంస్థలకు వస్తుసామగ్రి సరఫరా చేసే భారీ వాహనాలు రోడ్డుపైనే నిలిచి సామగ్రి దించుతున్నాయి. నిబంధనల ప్రకారం గూడ్స్ వెహికిల్ రాత్రిపూట అన్‌లోడ్ చేసుకోవాలి. కానీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రహదారిపైనే చిరువ్యాపారాలు సాగుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles