గ్రామ పంచాయతీలను అభివృద్ధి పర్చుకుందాం

Sun,April 21, 2019 12:24 AM

నిజాంసాగర్, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి పర్చుకుందామని మహమ్మద్‌నగర్ సర్పంచ్ దఫేదార్ బాలమణి అన్నారు. శనివారం మహమ్మద్‌నగర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. గ్రామంలో మురికికాల్వల మరమ్మతులు, వీధిలైట్ల బిగింపుతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయణ్‌రెడ్డి, నాయకులు దఫేదార్ విజయ్, వాజిత్, మహేందర్, కాశయ్య, గంగిరమేశ్, కార్యదర్శి రఘుపతిరెడ్డి, కారోబార్ అంబయ్య తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలి
పిట్లం: మండలంలోని జగదాంబ తండా పంచాయతీ అభివృద్ధికి గ్రామస్తులందరూ కృషి చేయాలని సర్పంచ్ వినోద అన్నారు. ఆమె శనివారం నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. గ్రామస్తులు పంచాయతీ పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. మురికి కాలువలు నిర్మాంచాలని తీర్మానం చేశారు. సమావేశంలో ఉపసర్పంచ్, కార్యదర్శి బలరాం, వార్డుసభ్యులు, తండావాసులు పాల్గొన్నారు.

అందరి సహకారంతోనే అభివృద్ధి
బిచ్కుంద: గ్రామ పెద్దలందరి సహకారంతో చిన్న దడ్గి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అనితావిఠల్‌రెడ్డి అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం, మురికికాల్వల నిర్మాణం, వీధిలైట్ల ఏర్పాటు విడతలవారీగా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రత్నాకర్‌ను జడ్పీటీసీ సాయిరాం తదితరులు సన్మానించారు. \

గ్రామాభివృద్ధికి పాటుపడదాం
మద్నూర్: అందరం కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడదామని సర్పంచ్ గఫార్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నశక్కర్గలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధిలో భాగాస్వామ్యం కావాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మం తదితరులు ఉన్నారు.

జీపీని అభివృద్ధి చేసుకుందాం
పెద్దకొడప్‌గల్: నూతన గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకుందామని పోచారం తండా సర్పంచ్ మదన్ అన్నారు. శనివారం పోచారం తండాలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ... సకాలంలో పన్నులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. అనంతరం పలు అభివృద్ధి పనలపై తీర్మానం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి రాములు, తండావాసులు పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles