కళాశాల అభివృద్ధికి రూ. 5 లక్షల చెక్కు అందజేత

Fri,April 19, 2019 11:58 PM

విద్యానగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను 1964లో ప్రారంభించిన అప్పటి నిజామాబాద్ కలెక్టర్ బి.ఎన్.రామన్ కళాశాల అభివృద్ధి కోసం రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. గత నెలలో 29వ తేదీన కళాశాల వార్షికోత్సవానికి ఆయన హాజరై ప్రకటించిన విరాళాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్ రావుకు అందజేశారు. ఈ డబ్బుతో గత పదేళ్లలో కళాశాలలో చదువుకొని వివిధ వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడ్డ విద్యార్ధుల వివరాల అధ్యయనం కోసం చేపట్టే ప్రాజెక్ట్‌కు వెచ్చించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, అధ్యాపకులు శంకర్, శరత్‌రెడ్డి, రిటైర్డ్ స్టాటికల్ అధికారి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles