షెడ్యూల్ ఖరారు !

Fri,April 19, 2019 02:29 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అంతా ఊహించినట్లే ఈ నెల 20న షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నెల 22న తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. వీటికి మే 6న పోలింగ్ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రెండో విడత నోటిఫికేషన్ ఈ నెల 26న విడుదల అయ్యే అవకాశమున్నది. వీటికి మే 10న ఎన్నికలు జరుగుతాయి. అలాగే మూడో విడత నోటిఫికేషన్ ఈ నెల 30న విడుదల చేస్తారు. మే 14న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల పాటు సమయం ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 22 మండలాలుండగా మొదటి విడత ఎన్నికల్లో 9 మండలాల్లో 88 ఎంపీటీసీ, 9 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడత పోలింగ్‌లో 7 మండలాల్లో 77 ఎంపీటీసీ స్థానాలకు, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి. మూడో విడతలో 6 మండలాల్లో 71 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. మొత్తం 526 గ్రామ పంచాయతీల్లో 236 ఎంపీటీసీ స్థానాలు, 22 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరమే వెలువడనున్నాయి.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles