బాన్సువాడలో దొంగల బీభత్సం

Fri,April 19, 2019 02:29 AM

పాత బాన్సువాడ : సినిమాల్లో దొంగతనాలను తలపించేలా సినీఫక్కీలో చోరీ జరిగింది. బాన్సువాడ పట్టణం పాత బాన్సువాడలోని ఐదిళ్లలో బుధవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. పక్క ఇళ్లకు బయటనుంచి గొళ్లాలు పెట్టి తాళం వేసిఉన్న ఇళ్లను ఎంచుకుని పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనానికి పాల్పడ్డారు. గడీ ప్రాంతానికి చెందిన మసాని కృష్ణారెడ్డి, లింగాల వెంకట్‌రెడ్డి, బండాపల్లి రాణి, దళితవాడలో బయ్యని కిష్టయ్య, బయ్యని విఠల్ ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. కృష్ణారెడ్డి ఇంట్లో రెండు తులాల బంగారం, 10 వేల నగదు, వెంకట్‌రెడ్డి ఇంట్లో 5 తులాల వెండి, 15 వేల నగదు, కిష్టయ్య ఇంట్లో తులంన్నర బంగారం, 2వేల నగదు, విఠల్ ఇంట్లో 20 తులాల వెండి, 2వేల నగదు అపహరించినట్లు బాధితులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని బాన్సువాడ ఎస్‌హెచ్‌వో మహేశ్‌గౌడ్ సిబ్బందితో కలిసి క్లూస్‌టీం ద్వారా పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

పోలీసులకు సమాచారం ఇవ్వండి ..
స్థానికులు ఏదైనా గ్రామాలకు వెళ్లినప్పుడు విధిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న సూచనను బేఖాతరు చేస్తున్నారని ఎస్‌హెచ్‌వో మహేశ్‌గౌడ్ అన్నారు. నిబంధనలు పాటించకపోవడంతో నష్టపోతున్నారని చెప్పారు. ఇళ్లకు తాళంవేసి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇస్తే గల్లీల్లో గస్తీ పెంచుతామని చెప్పారు. ఇంటి నిర్వహణకు ఎంతో ఖర్చుచేసే యజమానులు సీసీ కెమెరాలు బిగించుకోవడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నష్టం వాటిల్లదని సూచించారు. ఆయన వెంట ఎస్సై రాజయ్య, ఏఎస్సై దత్తాత్రిగౌడ్, మన్సూర్‌ఖాన్, పీసీలు వెంకటేశ్వర్లు, వసీ, గంగాధర్, మొగులయ్య తదితరులు ఉన్నారు.

110
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles