ఆనందోత్సాహాలతో పండుగలను నిర్వహించుకోవాలి

Fri,April 19, 2019 02:29 AM

ఎల్లారెడ్డి రూరల్: పరస్పర సహకారంతో అందరూ కలిసి పండుగలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని డీఎస్పీ సత్తెన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే, షబ్బే బారాత్ సందర్భంగా జగ్నుకేరాత్ ఉన్నందున హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లు పరస్పర సహకారంతో పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు. స్పందించిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతినిధులు తామంతా ఒకరికొకరం సహకరించుకొని పండుగలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషాల మధ్య జరుపుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై కమలాకర్, నాగిరెడ్డిపేట్ ఎస్సై గౌరీందర్‌గౌడ్, పోలీసు సిబ్బంది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

పండగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
పెద్దకొడప్‌గల్: ప్రశాంత వాతావరణంలో అన్ని మతాలకు గౌరవిస్తూ పండుగలను జరుపుకోవాలని పెద్దకొడప్‌గల్ ఏఎస్సై మాల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో రాజకీయ నాయకులు, గ్రామ యువకులతో శాంతి కమిటీ సమవేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని మాతాల వారు సామరస్యంగా ఉండాలన్నారు. డీజేలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో పండుగలను జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తిర్మల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మైనార్టీ, హిందూ సోదరులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

మత సామరస్యం పాటించాలి
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : కుల మతాలకు అతీంతగా పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని బాన్సువాడ పట్టణ ఎస్‌హెచ్‌వో మహేశ్‌గౌడ్ సూచించారు. గురువారం ఆయన బాన్సువాడలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షబ్బేబారత్, గుడ్ ప్రైడే డే, హనుమాన్ జయంతి శుక్రవారం ఒకే రోజు వస్తున్నాయన్నారు. ఎవరేని మతవిద్వేశాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ఏర్వాల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, మహ్మద్ ఎజాస్, ముఖీద్, అలీమొద్దీన్ బాబా, కొత్తకొండ భాస్కర్, బీజేపీ నాయకులు ఆర్సపల్లి సాయిరెడ్డి, శంకర్‌గౌడ్, హనుమాన్ ఊరేగింపు కమిటీ సభ్యుడు ఉమా మహేశ్, సీఎస్‌ఐ సభ్యులు ప్రశాంత్, సికిందర్, కాలనీ పెద్దలు, ఎంఐఎం నాయకుడు ఖాన్ తదితరులు ఉన్నారు.

పిట్లంలో..
పిట్లం: మండలంలోని ప్రజలు హనుమాన్ జయంతిని శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై ఆంజనేయులు అన్నారు. ఆయన గురువారం పిట్లం పోలీస్ ష్టేషన్‌లో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles