పన్నులు చెల్లించాలని నిరసన

Thu,April 18, 2019 12:09 AM

పాత బాన్సువాడ : మున్సిపల్ సిబ్బంది పన్ను వసూలుకు వెళ్తే యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్వయంగా మున్సిపల్ కమిషనర్ రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే... బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్‌లో ఉన్న మహేశ్వరీ థియేటర్ యాజమాన్యాన్ని వార్షిక పన్ను చెల్లించాలని మున్సిపల్ సిబ్బంది పలుమార్లు కోరారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో రెడ్ నోటీస్ సైతం జారీ చేశారు. అయినా పన్ను చెల్లించకపోవడంతో కమిషనర్ కుమారస్వామి స్వయంగా రంగంలోకి దిగి సిబ్బందితో కలిసి థియేటర్ ముందు బుధవారం బైఠాయించారు. మున్సిపల్ వాహనాలను సైతం థియేటర్ ఎదుట నిలిపి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ నిర్వహణ సజావుగా సాగాలంటే, సిబ్బంది వేతనాలు సకాలంలో ఇవ్వాలంటే పన్ను చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. మున్సిపల్ అధికారులు పన్ను అధికంగా వేశారని థియేటర్ యజమాని రత్నకుమార్ మున్సిపల్ కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. పన్ను తగ్గిస్తే చెల్లిస్తానని, లేదంటే చెల్లింపు తనవల్ల కాదని అన్నారు. లెక్కకు మించి పన్ను వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాన్సువాడ పంచాయతీగా ఉన్నప్పుడే 2013లో వచ్చిన జీవో ప్రకారం పన్ను వేశామని, అర్థం చేసుకోవాలని సిబ్బంది వివరించారు. ఎంతకీ వినకపోవడంతో మున్సిపల్ కమిషనర్ ఈ విషయాన్ని మున్సిపల్ స్పెషలాఫీసర్ ఆర్డీవో రాజేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. 2013 జీవో ప్రకారమే 56,000 రూపాయలు పన్ను విధించినట్లు చెప్పారు. ఇరువర్గాలతో మాట్లాడిన ఆర్డీవో థియేటర్ యాజమాన్యాన్ని సముదాయించడంతో రెండు మూడు రోజుల్లో పన్ను చెల్లిస్తామని అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. కమిషనర్ కుమారస్వామి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలోని వ్యాపార, వాణిజ్య, గృహ సముదాయ యజమానులు పన్ను చెల్లింపుల విషయంలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles