పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

Thu,April 18, 2019 12:09 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని జనహిత భవన్‌లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వివిధ మండల స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటుకు కావాల్సిన షెడ్, వైకుంఠధామం, డంపిగ్ యార్డు తదితర పనులను ఎంపీడీవోలు, క్షేత్రస్థాయిలో ఏపీవో, సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో సుమారు 15 వేల మంది కూలీలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలకు జాబ్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని, కూలీల మొబైల్ అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉపాధి కూలీలకు నీడ, తాగునీటి వసతి తప్పక కల్పించాలన్నారు. గ్రామాల్లో వాటర్ అండ్ శానిటేషన్ డబ్బులను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీరు పట్టాలని సూచించారు. ఉపాధి హామీ కూలీల డబ్బులను సకాలంలో చెల్లించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో చంద్రమోహన్ రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles