ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Thu,April 18, 2019 12:09 AM

విద్యానగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నిర్వహించనున్న పరీక్షలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను ఈ నెల 24 నుంచి మే 6 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ చాంబర్‌లో విద్యాశాఖ, ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్‌కో, పోలీస్, వైద్యశాఖ అధికారులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలు (కామారెడ్డి పట్టణంలో 5, బాన్సువాడలో 3, ఎల్లారెడ్డిలో 3 పరీక్షా కేంద్రాలు) ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీఈవో రాజు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

103
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles