రైతన్నకు మద్దతుగా..

Wed,April 17, 2019 12:42 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సంక్షేమానికి కృషి చేస్తున్నది. పంట వేసి మొదలు కొనుగోలు చేసే వరకు అన్ని వేళలా అండగా నిలుస్తున్నది. పంట పండించిన రైతుకు మద్దతు ధర అందించాలన్న ఉద్దేశంతో ప్ర భుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. జిల్లాకు మొత్తం 203 కొనుగోలు కేం ద్రాలు మంజూరయ్యాయి. ఇప్పటికే 35 కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 1,138 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశా రు. జిల్లాలో ఈ నెల 10న ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు 70 రోజుల పాటు కొనసాగుతా యి. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,770, బీ గ్రేడ్ ధా న్యానికి రూ.1,750 చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నారు. వానాకాలంలో 77,705 మంది రైతు ల నుంచి 3 లక్షల 59 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం విక్రయించిన రైతులకు రూ. 663 కోట్ల 9 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేశా రు. ఈ ఏడు యాసంగిలో జిల్లా వ్యాప్ంతగా లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యం లో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసారు.

రైతుకు అండగా సర్కార్
తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. వరి నారు పోసిననాటి నుంచి పంట వేసే వరకు అన్ని రకాలుగా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నది. నాటుకునే విత్తనాన్ని రాయితీ ద్వారా నాణ్యమైన విత్తనాలను అందిస్తూనే, పంట వేసుకోవడానికి పెట్టుబడి సాయం అందిస్తున్నది. పంట కోత దశకు వచ్చిన వెంటే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తున్నది. జిల్లాలో యాసంగి సీజన్ ముగియనుంది. పంటలు చేతికి రావడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు సిద్ధంగా కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. యాసంగిలో 203 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయగా, ఇప్పటికే జిల్లాలో 35 కేంద్రాలను ప్రారంభించారు. 203 కేంద్రాల్లో 184 సొసైటీల ద్వారా, 19 కేంద్రాలు ఐకేపీ ద్వారా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల అవసరాలను బట్టి కేంద్రాలను విడతల వారీగా ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు జూలై 10 వరకు కొనసాగుతాయి.

జోరుగా కాంటాలు..
జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు వసతి కల్పిస్తున్నారు. కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలూ చేపట్టారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లాలో 23 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. కలకత్త నుంచి మరో 14 లక్షల గన్నీ సంచులు రానున్నాయి.

77
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles