భూ రికార్డుల సమస్యలను పరిష్కరిస్తాం

Wed,April 17, 2019 12:40 AM

లింగంపేట: భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వంద శాతం సమస్యలు పరిష్కరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి సూచించారు. మండలంలోని శెట్పల్లి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ పరమైన సమస్యలు వంద శాతం పరిష్కారం కోసం మండలంలోని శెట్పల్లి గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు, కబ్జాలో ఉన్నవారి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. సమస్యలు అధికంగా ఉన్న గ్రామాల్లో తానే స్వయంగా ఉండి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా 13 మంది రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్ రామేశ్వర్, ఆర్‌ఐ సుభాష్, వీఆర్వో సునీత, సర్పంచ్ కంట్రపల్లి పద్మగంగారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిష్టాగౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ అట్టెం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సంజీవరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles