పకడ్బందీగా పరిషత్ ఎన్నికలు

Wed,April 17, 2019 12:40 AM

గాంధారి(సదాశివనగర్): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం గాంధారి, సదాశివనగర్ మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ సత్యనారాయణ హాజరై మాట్లాడారు. త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులందరూ తప్పకుండా హజరు కావాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా, పారదర్శంగా జరిగే విధంగా పీవో, ఏపీవోలు కృషి చేయాలని అన్నారు. అధికారులకు ఇచ్చిన పత్రాల్లో 17-సీ, 17-ఏ కాలంను తప్పకుండా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు అధికారులు ఇటీవల నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో డబ్బులు చెల్లించని అధికారులకు రెండు రోజుల్లో డబ్బులు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్లు లత, రవీందర్, ఎంపీడీవో ఆనంద్, ఎంఈవో సేవ్లానాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles