మిషన్ భగీరథ నీటిని అందించాలి

Wed,April 17, 2019 12:40 AM

రాజంపేట్: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వా రా ఇంటింటికీ అందిస్తున్న తాగునీటిని తమ గ్రామాలకు ఎందుకు సరఫరా చేయడం లేదంటూ పలు గ్రామాల సర్పంచులు మిషన్ భగీరథ ఏఈ బాలకిషన్‌ను నిలదీశారు. రాజంపేట్ మండలంలోని అరుగొం డ, కొండాపూర్, శేర్‌శంకర్‌తండా, ఎల్లారెడ్డిపల్లి తండా, ఎల్లారెడ్డిపల్లి, గుండారం, గుడితండా, లేతమామిడి తండా, సిద్ధాపూర్ గ్రామాలకు నీటిని సరఫరా చేయకపోవడంతో ఆగ్రహించిన సర్పంచులు మిషన్ భగీరథ ఏఈని మంగళవారం నిలదీశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. రెండు నెలలుగా గ్రామాలకు తాగునీరు రాకపోవడంతో ప్రజలు నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు ఆయా గ్రామాల సర్పంచులను ముట్టడించడంతో వారు మిషన్ భగీరథ ఏఈని నిలదీశారు. అనంతరం కామారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ను కలిసి సమస్య గురించి వివరించారు. కార్యక్రమంలో గుండారం సర్పంచ్ లక్ష్మణ్, సిద్ధాపూర్ సర్పంచ్ సత్తయ్య, ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ బీరయ్య, అరుగొండ సర్పంచ్ లక్ష్మీశ్రీనివాస్, కొండాపూర్ సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles