పెండింగ్‌లో ఉన్న భూవివరాలు సేకరించాలి

Wed,April 17, 2019 12:40 AM

బీబీపేట్: పెండింగ్‌లో ఉన్న భూవివరాలు సేకరించాలని ఆర్డీవో రాజేంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో రెవెన్యూ గ్రామ సభ ఏర్పాటు చేసి రైతుల రికార్డులను పరిశీలించి వారితో మాట్లాడారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు తమకు ఇంత వరకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు రాలేదని ఆర్డీవో దృషికి తీసుకెళ్లారు. ఈ విషయమై స్పందించిన ఆర్డీవో కొన్ని సాంకేతిక సమస్యలతో ఆలస్యం జరిగిందని త్వరలోనే అం దరికి పట్టా పాస్ పుస్తకాలు అందజేస్తామన్నారు. డిజిటల్ పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లిన రైతుల వివరాలు సేకరించి వారికి పాస్‌బుక్‌లు అందించాలని వీఆర్వోలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ కిష్ట య్య, ఆర్‌ఐ అంజయ్య, వీఆర్వోలు మహిపాల్‌రెడ్డి, అశోక్, ముత్తన్న, వీఆర్‌ఏలు వెంకటస్వామి, సర్పంచ్ అల్వాల రేవతిశ్రీనివాస్, ఉపసర్పంచ్ మోతే బాపురెడ్డి, గ్రా మ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు అల్వాల శ్రీనివాస్, బాగిరెడ్డి, లకా్ష్మరెడ్డి, తిరుపతిరెడ్డి, కాంతం, జై పాల్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles