సీనియర్ సివిల్ జడ్జి రోజారమణి బదిలీ

Wed,April 17, 2019 12:39 AM

నిజామాబాద్ లీగల్ : ఎక్కడున్నా, ఎక్కడికి బదిలీ అయిన న్యాయవ్యవస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడమే ఏజెండాగా న్యాయమూర్తులు తమ కర్తవ్యాలను నెరవేరుస్తారని ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కె.సుజన అన్నారు. నిజామాబాద్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తూ హైదరాబాద్‌కు బదిలీ పై వెళ్తున్న రోజారమణికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతివారూ కుటుంబ సభ్యులతో సమానం అని, అందరూ సమష్టి విధులు నిర్వహిస్తూ ప్రజలకు న్యాయసేవలు అందించాలని సూచించారు. బదిలీ పై వెళ్తున్న జడ్జి రోజారమణి మాట్లాడుతూ.. నిజామాబాద్ న్యాయవాదులతో కలిసి పనిచేసే అవకాశం లభించడం, అతి తక్కువ సమయంలోనే అందరి ఆదరాభిమానాలు పొందడం మరచిపోలేనన్నారు. జడ్జికి వీడ్కోలు సందర్భంగా జామా, దానిమ్మ మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు ఆకుల రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కార్యదర్శి మానిక్‌రాజ్, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు కవితారెడ్డి, స్రవంతి, అంకిత తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles