పరిషత్ పోరుకు సన్నద్ధం

Tue,April 16, 2019 01:26 AM

- మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు
- 236 ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధం
- వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు
- జిల్లాలో మొత్తం మండలాలు 22..
- మొదటి విడతలో 9.. రెండో విడతలో 7.. మూడో విడతలో 6 మండలాలు
- క్షేత్ర స్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. కామారెడ్డి జిల్లాలో ఉన్న 236 ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికల వివరాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. జిల్లాలో మూడు విడతలుగా జరుగనున్న ఎన్నిల కోసం జిల్లా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాలలో మొదటి విడతలో 9 మండలాలకు, రెండో విడతలో 7 మండలాలకు, మూడో విడుతలో 6 మండలాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దశల వారీగా జరిగే ఎన్నికల కోసం జిల్లాలోనే బ్యాలెట్ పత్రాలను అధికారులు తయారు చేసి ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలో పోటీలో నిలిచేందుకు వివిధ పార్టీల నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే అన్ని పార్టీలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్‌ల కోసం పోటీ ఉన్నది. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్‌లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండగా కాంగ్రెస్, బీజేపీల్లో ఆశావహుల సంఖ్య కొంత తక్కువగా కనిపిస్తున్నది. ముందుగా జరుగనున్న మొదటి విడతలో 88 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 77 ఎంపీటీసీ స్థానాలకు, మూడో విడుతలో 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

60
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles