ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Tue,April 16, 2019 01:25 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల్లో విధులు నిర్వహించే రిటర్నింగ్ ఆధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రిసైడింగ్ ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని, శిక్షణ అనంతరం పూర్తి సామర్థ్యంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. సోమవారం గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల మాదిరి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్, స్క్రూటినీ ఉపసంహరణ ప్రక్రియ చేపటాలన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం అనుసరించి ఎలాంటి నేరారోపణలు ఉన్న అభ్యర్థి పోటీ చేసిన వారి నామినేషన్ తిరస్కరించాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్‌నే వినియోగిస్తామన్నారు.

ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చుల వివరాలను ప్రత్యేక అకౌంట్‌లో లెక్కలు చూపించాలన్నారు. జడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2500, ఎంపీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.2500 డిపాజిట్‌ను నామినేషన్ సందర్భంగా తీసుకోవాలన్నారు. రాజ్యాంగంలోని 243 కె (3), 243 కె (4) అనుసరించి రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటారని ఎన్నికల సంఘం సూచించిందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆధికారులు పాల్గొన్నారు.

102
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles