రమణీయం.. రాములోరి కల్యాణం

Mon,April 15, 2019 12:47 AM

విద్యానగర్ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శారదాదేవి ఆలయం, ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయం, రామాలయం, పంచముఖి హనుమాన్ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సీతారాములను అందంగా అలంకరించి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయాల ప్రాంగణాలు రామనామస్మరణతో మార్మోగాయి. అనంతరం పలు ఆలయాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైభవంగా సీతారాముల కల్యాణం..
లింగంపేట: మండలంలోని మోతె గ్రామంలో నిర్వహించిన సీతరాముల కల్యాణ వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని బాణాపూర్, భవానీపేట, లింగంపేట గ్రామాల్లో రామాలయాల వద్ద సాయంత్రం ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు.
పాత బాన్సువాడ / గాంధారి : బాన్సువాడ మండలం తిర్మలాపూర్, దేశాయిపేట్, పోచారం గ్రామాల్లో, గాంధారి మండలంలోని శ్రీ రామాంజనేయ ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. కల్యాణ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి పుష్పమ్మతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పితృవాక్కు జవదాటని మహాపురుషుడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జనరంజకమైన పాలన అందించిన రాము డు సద్గుణాలతో దేవుడయ్యారని అన్నారు. తిర్మలాపూర్, దేశాయిపేట్‌లో నవమి ఉత్సవాల సందర్భంగా హనుమాన్ మాలధారులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దేశాయిపేట్‌లో స్థానిక హనుమాన్ స్వాములతో కలిసి నవమి ఉత్సవాల్లో, అన్నదానంలో పాల్గొన్నారు. స్పీకర్ దంపతులను దేశాయిపేట్ హనుమాన్ మాలధారులు సన్మానించి జ్ఞాపిక అందజేశారు. గ్రామానికి చెందిన వ్యాపారవేత్త శ్రీనివాసరావు, సర్పంచ్ శ్రావణ్ కుమార్ అన్నదాతలుగా నిలిచారు. బాన్సువాడ పట్టణంలోని శ్రీ రామాలయం, పాత బాన్సువాడ దళితవాడ రామాలయాల్లో కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. రమాకాంత్‌రావు, లక్ష్మీనారాయణ మూర్తి, దేవీకృష్ణప్రసాద్, శ్రీనివాస్, మురళి, పెర్క ఎల్లప్ప, దొన్కంటి సాయిలు, మల్లూరి సాయిలు, దొన్కంటి సంజీవ్, దొన్కంటి జగన్‌మోహన్, పండితులు పురుషోత్తం శర్మ, మధు శర్మ, గౌరారంలో సర్పంచ్ మహేందర్‌రెడ్డి, గ్రామస్తులు తూము అంజయ్య, జయరాం, సాయిరాం పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles