వన్యప్రాణి దాహం తీరుతోంది ఇలా..

Mon,April 15, 2019 12:46 AM

మాచారెడ్డి / లింగంపేట : అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో వన్యప్రాణులు తాగునీటి కోసం అలమటించకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేశారు. లింగంపేట మండలంలోని ముంబాజీపేట, కొండాపూర్, శెట్పల్లి, మెంగారం, బోనాల్, సురాయిపల్లి, ముస్తాపూర్, ఒంటర్‌పల్లి, పొతాయిపల్లి, కోమట్‌పల్లి, మాచారెడ్డి మండలం మద్దికుంట, రామారెడ్డి మండలంలోని మద్దికుంట, మాచారెడ్డి మండలం ఘన్‌ఫూర్(ఎం) తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో 50కి పైగా సాసర్‌పిట్‌లు నిర్మించారు. ఈ సారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురియక పోవడంతో అటవీ ప్రాంతంలోని ఒర్రెల్లో నీటి జాడలు కరువయ్యాయి. ఎండలు మండి పోతుండడంతో అధికారులు సాసర్‌పిట్‌లలో నీటిని నింపి ఉంచుతున్నారు. పది రోజులకు ఒక మారు ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. సాసర్ పిట్‌ల పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం వివరాలు తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు తాగు నీటి కోసం వచ్చిన వివరాలు సీసీ ఫుటేజీల్లో రికార్డు అవుతున్నాయి. ఎలుగు బంట్లు, మనుబోతులు, కొండగొర్రెలు, చిరుతలు, అడవి పందులు, నెమళ్లు, కుందేళ్లు తదితర వన్యప్రాణులు తాగు నీటి కోసం సాసర్‌పిట్‌ల వద్ద దాహార్తిని తీర్చుకుంటున్నాయి. రామారెడ్డి మండలంలోని మద్దికుంట అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లో నీటిని తాగుతూ మూడు చిరుతలు కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం అదే సాసర్‌పిట్‌లో నాలుగు చిరుతలు నీటిని తాగుతున్న దృశ్యం కెమెరాలో రికార్డు అయ్యింది.

66
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles