ఇక పోస్టల్ బ్యాలెట్ నామమాత్రమే

Mon,March 25, 2019 12:27 AM

గతంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఆరు నుంచి ఏడు వందల బ్యాలెట్ ఓట్లు ఉపయోగించే వారు. ఒక నియోజకవర్గంలో పని చేసే ఉద్యోగులు మరో నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే నిబంధన ఉన్నందున అప్పుడు బ్యాలెట్ ఓట్లు ఉండేవి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో పని చేసే ఉద్యోగులు పక్కనే ఉండే నియోజకవర్గంలో పని చేస్తున్నప్పటికీ ఆ నియోజకవర్గం సైతం ఒకే పార్లమెంటు పరిధిలో ఉన్నందున అక్కడే ఈవీఎంలో ఓటు వేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పార్లమెంటు పరిధిలో కాకుండా ఇతర పార్లమెంటు పరిధిలో విధులు నిర్వహించే వారికి మాత్రమే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అవకాశం ఉంటుంది. అంటే జహీరాబాడ్ నియోజకవర్గంలో నిజామాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉద్యోగులు పని చేస్తే వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం జహీరాబాద్ నియోజకవర్గంలో కేవలం అదే నియోజకవర్గంలోని ఉద్యోగులు విధులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలో బ్యాలెట్ ఓట్లు లేనట్లేనని అధికారులు పేర్కొంటున్నారు.

59
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles