మొక్కల పెంపకంలో నిర్లక్షం వహిస్తే చర్యలు

Mon,March 25, 2019 12:27 AM

గాంధారి : నర్సరీల్లో పెంచుతున్న మొక్కల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు కుప్రియాల్, మర్కల్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఆదివారం పరిశీలించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని, గ్రీన్ షెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీడీవో అశోక్, ఏపీవో శృతి తదితరులు ఉన్నారు.

చర్యలు తీసుకోవాలని వినతి
గాంధారి (సదాశివనగర్) : మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామసమీపంలో ఉన్న గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ ద్వారా వెలువడుతున్న కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణను అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్ జానకి కోరారు. గ్రామ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలతో గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వాసన, దుమ్ము, ధూళితో వాతావరణం కలుషితమై స్థానికులు రోగాల బారిన పడుతున్నారని విన్నవించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీపతి, విండో మాజీ ఉపాధ్యక్షుడు సంకరి రాజలింగం, సాగర్‌రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles