నేడు బీబీపాటిల్ నామినేషన్

Mon,March 25, 2019 12:27 AM

నిజాంసాగర్ / నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా బీబీ పాటిల్ సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారి, సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావుకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ బీబీపాటిల్ కోరారు.ఈ మేరకు ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్‌లో జడ్పీ చైర్మన్ దఫేదార్ నివాసంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ బీబీపాటిల్ నామినేషన్ కార్యక్రమానికి జుక్కల్‌నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ముఖ్యనాయకులు ఎంపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరూ సమష్టిగా టీఆర్‌ఎస్ గెలుపు కోసం కృషి చేశారని, అలాగే ఎంపీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ నాయకులు దఫేదార్ విజయ్, వాజిత్, గంగి రమేశ్, కాశయ్య, అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నామినేషన్ల స్వీకరణకు నేడు ఆఖరు
సంగారెడ్డి చౌరస్తా : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు నేటితో నామినేషన్‌ల దాఖలు గడువు ముగియనున్నది. ఇప్పటివరకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా ప్రధాన పార్టీల అభ్యర్థులు టీఆర్‌ఎస్ నుంచి బీబీ పాటిల్ రెండు సెట్‌లు, కాంగ్రేస్ నుంచి మధన్‌మోహన్‌రావు 2 సెట్‌లు దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థి భట్టు రాజు రెండు సెట్‌ల నామినేష న్లు దాఖలు చేశారు. మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఏ. ప్రవీణ్‌కుమార్, ముదిరాజ్ వెంకటేశంలు ఒక్కో నామినేషన్‌ను దాఖలు చేశారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 8సెట్‌ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన మొదలైన నామినేషన్ల పర్వం సోమవారంతో ముగియనున్నది. మొదటి రెండు రోజులు 18, 19వ తేదీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మూడో రోజు 20వ తేదీన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 21న హోలీ పండుగను పురస్కరించుకొని సెలవు దినం కావడంతో నామినేషన్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. నాలుగో రోజు నామినేషన్ల స్వీకరణలో భాగంగా అత్యధికంగా నలుగురు అభ్యర్థులు 5 సెట్‌ల నామినేషన్‌లను దాఖలు చేశారు. 23న నాల్గో శనివారం (కేంద్ర ప్రభుత్వ సెలవు దినం), 24న ఆదివారం సాధారణ సెలవు రోజు కావడంతో 25న సోమవారం ఒక రోజు మాత్రమే నామినేషన్‌ల దాఖలుకు గడువు మిగిలింది. దీంతో సోమవారం పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles