మహిళలే కీలకం

Sun,March 24, 2019 12:25 AM

కామారెడ్డి / నమస్తే తెలంగాణ: జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్ణయించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల శాతం అధికంగా ఉండడం గమనార్హం. గత ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాను అనుసరించి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, అందోల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థి గెలుపు మహిళా ఓటర్ల చేతుల్లో ఉంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14,95,479 ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 7,58,889, పురుషులు 7,36,528 మంది ఉండగా ఇతరులు 62 మంది ఉన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఒటర్లు 2,29,538 మంది ఉండగా వీరిలో మహిళా ఓటర్లు 1,18,779, పురుష ఓటర్లు 1,10,738 మంది ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,09,099 ఉండగా మహిళలు 1,08,616, పురుష ఓటర్లు 1,00,476 ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,89,465 మంది ఉండగా మహిళలు 96,107, పురుష ఓటర్లు 92,275 మంది ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 1,84,199 మంది ఉండగా మహిళలు 95,788, పురుష ఓటర్లు 88,409 మంది ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,11,520 మంది ఉండగా అందోల్‌లో 2,30,619 మంది, జహీరాబాద్‌లో 2,41,039 మంది ఓటర్లు ఉన్నారు.

కామారెడ్డి ఓటర్లే కీలకం
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో 14,95,479 మంది ఓటర్లు ఉండగా కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 8,12,301 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాలు అయిన నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 6,83,178 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో కామారెడ్డి జిల్లా ఓటర్లపైనే అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. కామారెడ్డి జిల్లా ఓటర్లే అధికంగా ఉండడంతో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles