నాలుగో రోజు ఐదు సెట్ల నామినేషన్లు

Sat,March 23, 2019 12:14 AM

సంగారెడ్డి చౌరస్తా : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నామినేషన్‌ల సంఖ్య ఎనిమిదికి చేరింది. శుక్రవారం నాలుగో రోజు (పని దినాల్లో భాగంగా) మొత్తం ఐదు సెట్‌ల నామినేషన్లు దాఖలు కాగా, టీఆర్‌ఎస్ పార్టీ నుంచి తాజా మాజీ ఎంపీ బీబీ పాటిల్ తరఫున రెండు సెట్‌ల నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్మింగ్ అధికారికి అందజేశారు. పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి రెండు రోజులు 18, 19వ తేదీల్లో ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.

మూడో రోజు 20వ తేదీన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 21న హోలీ పండుగను పురస్కరించుకొని సెలవు దినం కావడంతో నామినేషన్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. నాలుగో రోజు నామినేషన్ల స్వీకరణలో భాగంగా అత్యధికంగా నలుగురు అభ్యర్థులు ఐదు సెట్‌ల నామినేషన్‌లను దాఖలు చేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కామారెడ్డి జిల్లా జుక్కల్‌కు చెందిన మాజీ ఎంపీ భీమ్‌రావు బస్వంత్‌రావు పాటిల్ (బీబీ పాటిల్) తరఫున రెండు సెట్‌ల నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. అయితే అభ్యర్థి తరఫున ఎమ్మెల్సీ ఫరీదొద్దీన్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌కు కలిసివచ్చి రిటర్నింగ్ అధికారి హనుమంతరావుకు నామినేషన్ దాఖలు చేశారు. మరో సెట్‌ను అదే పార్టీకి చెందిన నాయకులు శ్రీకాంత్ పాటిల్, ఎండీ మోయిద్‌ఖాన్, నాగభూషణం, జైపాల్‌రెడ్డి, సాయికుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంరావు దాఖలు చేశారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన ఎ.ప్రవీణ్‌కుమార్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ఇదే జిల్లా నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ వెంకటేశం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన అల్లీపూర్‌కు చెందిన భట్టు రాజు స్వతంత్ర అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు అభ్యర్థులు 8 నామినేషన్లు దాఖలు చేశారు.

మిగిలింది ఒక రోజే
అయితే నామినేషన్ దాఖలుకు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్‌ల ప్రక్రియ ఈ నెల 25తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో 23న నాలుగో శనివారం (కేంద్ర ప్రభుత్వ సెలవు దినం), 24న ఆదివారం సాధారణ సెలవు రోజు కావడంతో 25న సోమవారం ఒక రోజు మాత్రమే నామినేషన్‌ల దాఖలుకు చివరి గడువు కానున్నది. దీంతో ఆ రోజు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు లేకపోలేవు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు హజీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

89
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles