నీటితోనే మానవ మనుగడ

Sat,March 23, 2019 12:14 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : నీటితోనే మానవ మనుగడ అని, నీటిని వృథా చేయవద్దని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. 26వ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జిల్లా భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాశీవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జలాల వృథా అరికడతామని, జలవనరుల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా అధికారులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటిని కలుషితం చేయడం, దుర్వినియోగం చేయడం మానవాళికే ముప్పు అన్నారు. నీరు ప్రాణకోటికి జీవనాధారమని, జలాలను పొదుపుగా వాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల ద్వారా జలవనరుల పెరుగుదలకు చర్యలు చేపడుతున్నామని, ఇందులో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. రెండు సంవత్సరాల్లో 20 మీటర్ల లోతు నుంచి 15 మీటర్ల వరకు జలాలు పెరిగాయని, దక్షిణాది రాష్ర్టాల్లో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో సోక్‌పిట్స్, ఫాంపాండ్స్, అటవీ ప్రాంతాల్లో కాంటూరీ స్ట్రక్చర్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అంతకు ముందు శుక్రవారం వాటర్‌డే సందర్భంగా రాశీవనంలో మొక్కలకు నీరు పోశారు. కార్యక్రమంలో డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, భూగర్భ జలాల అధికారి శ్రీనివాస్‌బాబు, డాక్టర్ రామన్న, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles