ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా..?

Sat,March 23, 2019 12:14 AM

కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలోని అడ్లూర్ గ్రామ పరిసర ప్రాంతంలో గతంలో పైప్‌లైన్ లీకేజీ కావడంతో గుంతను తవ్వి లీకేజీని సరిచేసి అధికారులు తిరిగి ఆ గుంతను పూడ్చడం మాత్రం మరచిపోయారు. జనవరి 29వ తేదీన కామారెడ్డి అడ్లూర్ రోడ్డులోని బైపాస్ వద్ద పైప్‌లైన్ లీకేజీ అయ్యింది. అధికారులు రెండు రోజుల్లో లీకేజీ పనులు పూర్తి చేయించారు. కానీ రెండు నెలలు కావస్తున్నా ఆ గుంతను మాత్రం పూడ్చడం మరిచారు. పెద్ద బావిలా ఉన్న ఈ గుంత రోడ్డుకు ఆనుకొని ఉండడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఈ రోడ్డు వెంబడి అడ్లూర్, ఇల్చిపూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, రంగంపేట్, ఇస్రోజివాడి, పోసానిపేట్, గిద్ద, ఉప్పల్‌వాయి తదితర గ్రామాలకు నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రయాణం చేస్తుంటారు. రాత్రివేళలో అయితే మరీ ప్రమాదకరంగా ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles