నేడే ఎమ్మెల్సీ పోలింగ్

Fri,March 22, 2019 01:20 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:శాసనమండలి ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. నేడు ఉదయం 8గంటల నుంచి సా యంత్రం 4గంటల వరకు పట్టాభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగనున్నాయి. జిల్లాలో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టాభద్రుల ఓటర్ల కోసం 28 పోలింగ్ కేంద్రా లు, ఉపాధ్యాయ ఓటర్లకు 22 పోలింగ్ స్టేషన్‌లను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలోనూ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు ఉండటంతో అన్ని మండలాల్లో నూ పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రాల్లో ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్యను అనుసరించి ఒకటి కన్నా ఎక్కువ పో లింగ్ కేంద్రాలను నెలకొల్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను బందోబస్తు మధ్య కరీంనగర్ జిల్లా కేంద్రానికి తరలిస్తారు.

ఓటరు స్లిప్పుల గందరగోళం..
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు జారీ చేసిన స్లిప్పులు కాస్తా గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే పోలింగ్ సమయం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అని ఈసీ స్పష్టంగా పేర్కొంది. ఈ సమాచారం ఆయా మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి చేరింది. అయితే, ఓటరు స్లిప్పుల్లో మాత్రం పోలింగ్ సమయం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకంటూ పేర్కొనడంతో గందరగోళానికి దారి తీస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పని చేస్తున్న చోటనే ఓటు వేసే సదవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించబోతోంది.

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఆధారంగా ఉ ద్యోగులు తాము విధుల్లో ఉన్న పోలింగ్ బూత్‌లోనే ఓటేసే వీలుంది. గతంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తే అది సరైన సమయంలోపు చేరుతుందో లేదో అన్నది సందేహంగా ఉండేది. తమ ఓట్లు పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్న దాని పై ఆందోళన ఉండేది. ఇప్పుడీ నూతన అవకాశం ద్వారా ఉద్యోలంతా ఇటు ఎన్నికల విధులు చేపడతూనే తమ ఓటును నేరుగా బ్యాలెట్ బాక్సులో వేసే అవకాశం రావడం ఇదే తొలిసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న రెవెన్యూ డివిజనల్ అధికారుల ద్వారా జారీ చేసిన ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్‌తో ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే ఉద్యోగులు ఓటెయ్యొచ్చు.

ఓటర్ల వివరాలివీ..
పట్టాభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగాయి. ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాలను సైతం అధికారులు విపరీతంగా పెంచారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశా రు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కరీంనగర్ నియోజకవర్గానికి 2013 ఫిబ్రవరి 21న జరిగిన గత ఎన్నికల్లో 324 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇప్పుడు వీటి సంఖ్యను 566కి పెంచా రు. కామారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 11,777 మందికి 28 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఓటర్లు 1,900 మందికి 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నాలుగు జి ల్లాల పరిధిలో 2013లో 1,56,121 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 1,90,082 మందికి చేరింది. మొత్తంగా 33,961 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు.

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోనూ ఓట్లు పెరగడంతో గతంలో ఉన్న 20,289 ఓటర్ల సంఖ్య కాస్తా 22,487 మంది ఓటర్లకు చేరింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్‌లలో 500 మంది ఓటర్లు దాటిన చోట రద్దీని నిలువరించేందుకు రెండో కౌంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

హోరాహోరీ పోటీ..
కరీంనగర్ పట్టాభద్రుల శాసనమండలి స్థానానికి ప్రస్తుతం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కొనసాగుతున్నారు. ఉపాధ్యాయుల శాసనమండలి స్థా నం నుంచి పాతూరి సుధాకర్ రెడ్డి ఉన్నారు. వీరి ఇరువురి పదవీ కాలం మార్చి 29వ తేదీ లోపు ముగియనుంది. పట్టాభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కరీంనగర్ నియోజకవర్గం ఎన్నికలకు భారీ పోటీ నెలకొంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇదే నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఏడుగురు బరిలో నిలిచారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, పి.కొండల్‌రెడ్డి, చిట్యాల రా ములు, బి.మెహన్‌రెడ్డి, మామిడి సుధాకర్ రెడ్డి, జి.వేణుగోపాలస్వామి బరిలో నిలిచారు. పట్టభద్రుల స్థానం నుంచి మొత్తం 35 నామినేషన్లు దా ఖలు కాగా 11 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

మరో ఏడుగురు విత్ డ్రా చేసుకోవడంతో బరిలో 17 మంది నిలిచారు. కాంగ్రెస్ నాయకుడు టి.జీవన్ రెడ్డి, పి.సుగుణాకర్ రావు, గుర్రం ఆంజనేయులు, ఎడ్ల రవికుమార్, కల్లెం ప్రవీణ్ రెడ్డి, గంట సంపత్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, దేవునూరి రవీందర్, పారువెల్లి ప్రభాకర్ రావు, మాడగోని బాలనాగసైదులు, జి.రణజిత్ మోహ న్, వై.రాంరెడ్డి, వి.శివకుమార్, కె.శ్రీధర్ రాజు, షేక్ షబ్బీర్ అలీ, రేంజర్ల సురేశ్, రాణి రుద్రమతో పాటుగా గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles