పీవైఎల్ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

Fri,March 22, 2019 01:14 AM


శక్కర్‌నగర్: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం పీవైఎల్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్ధంతి సందర్బంగా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా కార్యదర్శి శ్రావణ్‌కుమార్, పట్టణ కార్యదర్శి ఎస్. శేఖర్ మాట్లాడారు.యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా భగత్‌సింగ్ వర్ధంతి సభలను నిర్వహించాలని పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. దళితులపై, ఆదివాసీలపై, మైనార్టీలపై జరుగుతున్న ఫాసిస్ట్ దాడులకు వ్యతిరేకంగా యువతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతి సభలను పీవైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నటు తెలిపారు. ఈ సభలను విజయవంతం చేసేందుకు పీవైఎల్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు శ్రీకాంత్, వినోద్, సంపత్ గౌడ్, సాయిగౌడ్, సంజీవ్ పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles