కవిత్వంతో సామాజిక ప్రయోజనం చేకూరాలి

Fri,March 22, 2019 01:13 AM

విద్యానగర్ : కవిత్వంతో సామాజిక ప్రయోజనం చేకూరాలని ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో 11వ ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూరారం శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జీవితం, కవిత్వం ఒక్కటైన వాడే నిజమైన కవి అని, జీవితాలను పదునుపెట్టుకోవడం కోసం రుద్దుకునే ఆకు రాయి కవిత్వమని అన్నారు. కవుల చేతుల్లో ఉలి లేకుండానే శిల్పాలు చెక్కబడతాయన్నారు. యువ కవులకు ఎన్నీల ముచ్చట్ల ద్వారా ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు. అనంతరం మూలధ్వని, ఎన్నీల ముచ్చట్లు అనే పుస్తకాలను ఆవిష్కరించారు. యువ కవి రోశయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్, ఉపాధ్యక్షుడు పీతాంబర్, కార్యదర్శులు రోశయ్య, రవీందర్, రామచంద్రం, గరిశకుర్తి రాజేంద్ర, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles