జిల్లా కేంద్రంలో పోలీసుల కవాతు

Fri,March 22, 2019 01:13 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సాయంత్రం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల్లో భాగంగా కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు పోలీసు బలగాలు పని చేస్తున్నాయన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకుసాగి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. పట్టణంలోని సిరిసిల్ల రోడ్, గాంధీ గంజ్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, పెద్ద బజార్, నిజాంసాగర్ రోడ్, విద్యానగర్, కొత్త బస్టాండ్ మీదుగా కవాతు కొనసాగింది. కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు రవి కుమార్, గోవింద్, పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles