ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

Fri,March 22, 2019 01:13 AM

నస్రుల్లాబాద్ : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయాన్ని భగవన్నామస్మరణకు కేటాయించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని నెమ్లి సాయి ఆలయ పదో వార్షికోత్సవానికి గురువారం హాజరై సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుళ్లకు భక్తులు వివిధ రకాల పేర్లతో పూజలు చేస్తున్నా భగవంతుడు ఒక్కరేనన్నారు. సమాజంలో రోజురోజుకూ ఆధ్యాత్మికత, దీక్షాదారుల సంఖ్య పెరగడం సంతోషకరమన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త పట్లోల్ల మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పీకర్ పోచారాన్ని ఘనంగా సన్మానించారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం..
మండలంలోని నెమ్లి సాయిబాబా ఆలయ పదో వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్లోల్ల మోహన్‌రెడ్డి దంపతులు మహా యజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం అభిషేకం, భజన కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేలారే రేలా ఫేం రషీద్ పాడిన పాటలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, సర్పంచ్ గంగమణి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles