సేంద్రియ వ్యవసాయమే మేలు..

Fri,March 22, 2019 01:12 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ధర్మారం (బి) గ్రామా న్ని గురువారం సందర్శించారు. ఉదయం ధర్మారం (బి) గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రా మస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామ వనరులను, భూగర్భ జలాల పరిస్థితి, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత గ్రామం, మంచినీటి, సాగునీటి వనరులపై చర్చించారు. గ్రామస్తులు స్వ చ్ఛందంగా రక్షిత మంచినీటి కార్యక్రమం చేపట్టడం, ఆధునిక సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం అభినందనీయమని అధ్యాపకులు అన్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాల పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. గతంలో వంద, రెండు వందల ఫీట్లలో నీళ్లు పడేవని ఇప్పుడు కనీసం ఐదారు వందల అడుగులలోతైనా నీటి లభ్యత లేదన్నారు. వర్షాలు సరిగా లేకపోవడం, కరువు పరిస్థితులు, నీటి సంరక్షణ, యాజమాన్య పద్ధతులు లేకపోవడం, చెట్ల నరికివేత, చెట్ల పెంపకం అనుకున్నంత లేకపోవడం ఈ సమస్యలకు ప్రధాన కారణమని పే ర్కొన్నారు. అనంతరం కులవృత్తుల పరిశీలనకు ఎఫ్‌డీపీ బృందం సభ్యులు గ్రామంలో పర్యటించి వడ్రం గి, కమ్మరి కొలిమి వద్దకు వెళ్లి వారు తయారు చేస్తున్న పనిముట్లను, తయారీ విధానాన్ని పరిశీలించారు. నై పుణ్యాల వినియోగం, మార్కెటింగ్, ధరలు, డిమాం డ్, అవసరాలు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉ త్పత్తులకు, గ్రామీణ కులవృత్తి దారుల కృషికి సరైన ధ రలు దొరికినప్పుడు ఉపాధి అవకాశాలు మెరుగై, వలసలు తగ్గినప్పుడే గ్రామాలు పునరుజ్జీవన పొందుతాయని గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీపీ డైరెక్టర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్, కన్వీనర్ డాక్టర్ కె.రాజారాం, నందిని, కంట్రోలర్ డాక్టర్ సంపత్‌కుమార్, పీఆర్వో డాక్టర్ వి.త్రివేణి, రిసోర్స్‌పర్సన్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles