ఘరానా మోసం..!

Thu,March 21, 2019 12:31 AM

ఖలీల్‌వాడి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన ఘటన జిల్లా లో వెలుగుచూసింది. మాక్లూర్ మండలం గుత్ప తండాకు చెందిన సతీశ్ అనే వ్యక్తి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేశాడు. బాధితులు, పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్ప తండాకు చెందిన సతీశ్ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానను అడ్డగా చేసుకొని అక్రమానికి తెరలేపాడు. నిరుద్యోగ యువకులు, ఏఎన్‌ఎం కోర్సు చేసిన యువతులను లక్ష్యంగా చేసుకొని వారికి జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఒక్కొక్కరి వ ద్ద నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు డబ్బులు వ సూలు చేశాడు. ఇలా మొత్తం 24 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ముందు శిక్షణ తరగతులు ఉం టాయని, నెల రోజుల పాటు శిక్షణ తరగతుల అనంతరం ఉ ద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. నెల పదిహేను రోజుల క్రితం వారిని జిల్లాకేంద్ర దవాఖానకు పిలిపించాడు. ఉద యం 9.30 గంటలకు వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు తీసుకున్నాడు. ఇలా కొన్ని రోజుల పాటు సంతకాలు తీసుకున్నాడు.

విధుల కేటాయింపు..
ఇద్దరిని ఓపీ చిటీలు రాసే విభాగంలో, నలుగురిని అత్యవసర విభాగంలో, మరో నలుగురిని వార్డుల్లో పలు చోట్ల విధు ల్లో కేటాయించాడు. నెల రోజుల పాటు కేటాయించిన విభాగంలో వారు విధులు నిర్వహించారు. వేతనాలు ఇచ్చే విధా నం బాధితులను సతీశ్ తెలివిగా నమ్మించాడు. నెలకు రూ. 10 నుంచి రూ. 15వేలు ఇస్తామని, మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తారని, సంవత్సరానికి ఈ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని నమ్మించాడు.

బాగోతం వెలుగుచూసింది ఇలా..
విధి నిర్వహణలో ఉన్న సమయంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాములు రోగులకు వైద్య సేవలందిస్తున్న సిబ్బంది పనితీరులో లోపాలను గుర్తించాడు. అత్యవసర విభాగంలో ఓ రోగికి యువకుడు సూదిమందె ఇవ్వడంలో తడబడడంతో ఆరాతీయగా బండారం బయట పడింది. కొ త్తగా కనబడుతున్న వ్యక్తులందరినీ పిలిచి ఆరాతీశారు. తమను సతీశ్ అనే వ్యక్తి దవాఖానలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల్లో నయమించాడన కొత్తగా నియమితులైన వారు చెప్పారు. దీంతో దవాఖాన సూపరిండెండెంట్ రాములు దవాఖానలో పనిచేస్తున్న పది మందిని సెక్యూరిటీ సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశాడు. బాధితులు మోసపోయామని తెలుసుకొని సతీశ్‌పై అదే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో బాధితులు సూపరింటెండెంట్ డాక్టర్ రాములుకు జరిగినదంతా క్షుణ్ణం గా వివరించారు. జగిత్యాల, సిరిసిల్ల, ఆర్మూర్, మాక్లూర్, బోధన్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 24 మంది జాబ్ చేయడానికి వచ్చామని, సతీశ్ తమను మోసం చేసిన విషయం మీరు చెప్పే వరకు తెలియలేదని బాధితులు వాపోయారు.

నిజాలు బయటపడబోవడానికి కారణం..
నిజామాబాద్ జిల్లాకేంద్ర దవాఖానకు నిత్యం స్థానిక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుంచి 400 మంది వరకు విద్యార్థులు శిక్షణ నిమిత్తం వస్తుంటారు. రెండో సంవత్సరం చదివే విద్యార్థులు దవాఖానలో పనిచేస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకొని సతీశ్ తను డబ్బులు వసూలు చేసిన వారిని వారితో పాటు పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నాడు. తెలుపు రంగు బట్టలు వేసుకోవడంతో ఎవరూ గుర్తించలేక పోయారు. వాస్తవానికి నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రెండో సంవత్సరంలో ప్రభుత్వ దవాఖానలో శిక్షణ ఉంటుంది. తర్వాత సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేస్తారు. దీనిని తనకు అనుకూలంగా మలుచుకొని సతీశ్ అమాయకు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు.

ప్రభుత్వ దవాఖాన సిబ్బందిపై అనుమానాలు..
ఇంతటి మోసానికి పాల్పడిన సతీశ్‌కు దవాఖానలో ఉన్న సిబ్బందికి సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ప్రభుత్వ దవాఖానలో 24మంది నెల పదిహేను రోజుల పాటు ఎలా విధులు నిర్వహిస్తారనే సందేహం అందరిలో కలుగుతున్నది. దీనిపై దవాఖాన సూపరింటెండెంట్ సమగ్ర విచారణకు ఆదేశించారు. దీనికోసం యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. టీమ్‌లో దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, వైద్యులు నాగేశ్వర్‌రావు, భీమ్‌సింగ్ ఉన్నారు. మూడు రోజుల్లో పూర్తి నివేదికను తనకు అందించాలని బృందానికి సూపరింటెండెంట్ తఆదేశాలు జారీ చేశారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles